తహారత్

తహారత్

తహారత్

తహారత్ అనగా శుచిశుభ్రత, మూత్రము, మూత్రపు చినుకులు దేహంపై గాని, తను, ధరించిన బట్టపై గాని పడిన చాలా అపవిత్రంగా భావింతుము. అందుచే మూత్ర విసర్జన చేయునప్పుడు, చాలా జాగ్రత్తగా ఆఖరి బొట్టు వరకు విసర్జన చేసి, మూత్ర స్థలమును శుభ్రమైన నీటితోగాని, శుభ్రమైన ఇటుక ముక్కతోగాని శుభ్రము చేసుకోవలెను. దేహంపై గాని, తాను ధరించిన వస్త్రము లపైగాని ఎటువంటి మలినము,(గిలాజత్) లేకుండా కాపాడుకోవలెను. నిస్సందేహంగా చెడుకు దూరంగా వుండి, పరిశుభ్రతను పాటించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు (ఖుర్ఆన్ 2-222). ఒకవేళ ఏదైనా మలినము శరీరము పైగాని, బట్టలపై గాని పడినట్లయితే నీళ్ళతో కడిగి శుభ్రము చేసుకోవలెను. 

ఈ శుభ్రతలు 3 విధాలు.

  1. దేహ శుభ్రతకు ‘తహారతే జిసం’ అంటారు. 
  2. తాను ధరించిన వస్త్రములు శుభ్రంగా ఉంచుకొనుటకు ‘తహారతె లిబాస్ అంటారు. 
  3. తాను నమాజ్ చదివే స్థలమును శుభ్రంగా ఉంచుకొనుటకు ‘తహారతి ముఖాం’ అంటారు.

పై శుభ్రతలే కాకుండా మనసును పవిత్రంగా, ఎటువంటి కల్మషము లేకుండా నిర్మలముగా ఉంచుకొనుట ముఖ్యము.దీనిని ‘తహారతే ఖల్బి’ అంటారు. ఈమాతో ఉన్నటువంటి ప్రతీ ముస్లింయొక్క హృదయము నిర్మలముగా ఉండును.  ఈ మూడు శుభ్రతలు నమాజ్ కు ముందు ముఖ్యము. 

 544 total views,  2 views today

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *