40 rabbana

40-rabbana

رَبَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ
రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీ ఉల్ అలీం [2:127]

Telugu Translation

ఓ మా ప్రభూ ! మా సేవలను అంగీకరించు, నిస్సందేహంగా నీవు అందరి మొరలనూ వినేవాడవు సర్వం తెలిసినవాడవు .


رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَا أُمَّةً مُّسْلِمَةً لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ
రబ్బనా వజ్ అల్ నా ముస్లిమైని లక వ మిన్ జుర్రియ్యతినా ఉమ్మతన్ ముస్లిమతల్ లక వ అర్నా మనాసికనా వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్రహీం [2:128]

Telugu Translation

ఓ మా ప్రభూ ! మా ఇద్దరినీ నీ విధేయులుగా చెయ్యి. మా సంతానం నుండి నీ కొరకు ఒక ముస్లిం సమాజాన్ని తయారు చెయ్యి, మాకు నిన్ను ఆరాధించే పద్దతులను నేర్పు, మా పశ్చాతాపాన్ని అంగీకరించు, నిస్సందేహంగా నీవు పశ్చాతాపాన్ని అంగీకరించే వాడవు. దయామయుడవు.


رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్ వ ఫిల్ ఆఖి రతి హసనతన్ వఖినా ‘అదాబన్నార్ [2:201]

Telugu Translation

ఓ ప్రభూ ! ఇహలోకం లోనూ మరియు పరలోకం లోనూ మంచిని ప్రసాదించి, నరక శిక్షల నుండి కాపాడుము


رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
రబ్బనా అఫ్ రిగ్ అలైనా సబ్ రన్ వ తబ్బిత్ అఖ్ దామనా వన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్ [2:250]

Telugu Translation

ఓ ప్రభూ ! శత్రువులని ఎదుర్కొనునపుడు సహనము ,స్థిరత్వము నొసంగి శత్రువులపై విజయమును నొసంగుము.


رَبَّنَا لاَ تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا
రబ్బనా లాతు ఆఖిజ్ నా ఇన్ నసీనా ఔ అఖ్ తానా [2:286]

Telugu Translation

ఓ ప్రభూ ! మేము మరచినను లేక పొరపాటు పడినను మమ్ము పట్టకుము .


رَبَّنَا وَلاَ تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا
రబ్బనా వలా త హ్ మిల్ అలైనా ఇస్ రన్ కమాహమల్ తహూ అలల్లజీన మిన్ ఖబ్ లినా [2:286]

Telugu Translation

.ఓ మా ప్రభువా ! మాకు ముందు గడచిన వారిపై నీవు మోపినట్టి భారమును మాపై మోపకుము


رَبَّنَا وَلاَ تُحَمِّلْنَا مَا لاَ طَاقَةَ لَنَا بِهِ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا أَنتَ مَوْلاَنَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
రబ్బనా వలా తుహమ్మిల్ నా మా లా తాఖత లనా బిహీ వ అఫు అన్నా వగ్ ఫిర్ లనా వర్ హమ్ నా అన్త మౌలానా ఫన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్ [2:286]

Telugu Translation

ఓ మా ప్రభూ ! సహింప లేని భారమును మాపై నుంచకుము . మమ్ము వదిలి పెట్టుము . మమ్ము క్షమింపుము . మమ్ము కరుణించుము .నీవే మాకు సహాయుడువు . కావున నీవు అవిశ్వాసులకు విరుద్ధముగా మాకు సహాయము చేయుము


رَبَّنَا لاَ تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً إِنَّكَ أَنتَ الْوَهَّابُ
రబ్బనారబ్బనా లాతుజిగ్ ఖులూబనా బనా బ అద ఇజ్ హదైత నా వ హబ్ లనా మిల్ లదున్క రహ్మ తన ఇన్నక అన్ తల్ వహ్హాబ్ [3:8]

Telugu Translation

ఓ ప్రభూ ! నీవు మాకు సన్మార్గము చూపిన పిదప మా హృదయములను తప్పు త్రోవలకు పోనియ్యకుము . నీ దయను మా పై ఉంచుము . నీవే సర్వము నొసంగువాడవు.


رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لاَّ رَيْبَ فِيهِ إِنَّ اللّهَ لاَ يُخْلِفُ الْمِيعَادَ
రబ్బనా ఇన్నక జామి ఉన్నాసి లియౌమిల్ లారైబ ఫీహి ఇన్న ల్లాహ లా యుఖ్ లిఫుల్ మిఆద్ [3:9]

Telugu Translation

ఓ మా ప్రభూ ! నీవు సర్వ జనులను ఒక దినము చేర్తువు . ఆ దినము గూర్చి ఎట్టి సందేహము లేదు . నిశ్చయముగా అల్లా : ఎప్పటికిని తానిచ్చిన మాటకు వ్యతిరేకము చేయడు.


رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ
రబ్బనా ఇన్ననా ఆమన్నా ఫగ్ ఫిర్ లనా జునూబనా వ ఖిన్నా ‘అధాబన్నార్ [3:16]

Telugu Translation

ఓ మా ప్రభూ ! మేము విశ్వ సించాము, కనుక మా పాపాలను మన్నించు ఇంకా మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు.


رَبَّنَا آمَنَّا بِمَا أَنزَلَتْ وَاتَّبَعْنَا الرَّسُولَ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
రబ్బనా ఆమన్నా బిమా అన్ జల వత్ తబ అ నర్ రసూల ఫక్ తుబ్నా మ అష్ షాహిదీన్ [3:53]

Telugu Translation

ఓ మా ప్రభూ ! నీవు పంపిన దానిని విశ్వసించితిమి . ప్రవక్తకు విధేయులైతిమి . కావున విశ్వసించితిమి . ప్రవక్తకు విధేయులైతిమి . కావున విశ్వసించిన సాక్షులలో మమ్ము వ్రాసికొనుము


ربَّنَا اغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينََِ
రబ్బనగ్ ఫిర్ లనా జునూబనా వ ఇస్రాఫనా ఫీ అమ్ రినా వ సబ్బిత్ అఖ్ దామనా వన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్ [3:147]

Telugu Translation

ఓ మా ప్రభూ ! మా పాపములను , మా కార్యములలో , మేము మితిమీరి పోయిన దానిని క్షమించుము . మా పాదములను స్థిరముగా ఉంచుము . అవిశ్వాసులను జయించుటకు మాకు సహాయపడుము


رَبَّنَا مَا خَلَقْتَ هَذا بَاطِلاً سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ
రబ్బనా మా ఖలక్ తా హాజా బాతిలన్ సుబహానక ఫఖినా అజాబన్నార్ [3:191]

Telugu Translation

మా ప్రభూ! నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు నువ్వు పవిత్రుడవు . మమ్మల్నినరకాగ్ని శిక్ష నుంచి కాపాడు


رَبَّنَا إِنَّكَ مَن تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
రబ్బనా ఇన్నక మన్ తుద్ ఖిలన్నార ఫఖద్ అఖజైతహు వమా లిద్దాలిమినా మిన్ అన్సార్ [3:192]

Telugu Translation

ఓ మా ప్రభూ! నువ్వెవరినైతే నరకాగ్నిలో పడవేస్తావో, వాణ్ణి నువ్వుపరాభవానికి , అవమానానికి గురి చేసినట్లే యదార్థానికి తోడ్పడేవారెవరూ ఉండరు.


رَّبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلإِيمَانِ أَنْ آمِنُواْ بِرَبِّكُمْ فَآمَنَّا
రబ్బనా ఇన్ననా సమ్యినా మునాదియ్య యునాది లిల్ ఈమాని అన్ అమిను బి రబ్బకుమ్ ఫ అమన్నా [3:193]

Telugu Translation

ఓ మా ప్రభూ!పిలిచేవాడొకడు విశ్వాసం (ఈమాన్)వైపుకు పిలవటం , ప్రజలారా మీ ప్రభువును విశ్వసించండి అని పిలుపు నివ్వటం మేము విన్నాము అంతే మేము విశ్వసించాము.


رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الأبْرَارِ
రబ్బనగ్ ఫిర్ లనా జునుబనా వ కఫ్ఫిర్ అన్నా సయ్యిఆతినా వతవఫ్ఫనా మా అల్ అబ్ రార్ [3:193]

Telugu Translation

ఓ ప్రభూ! మా పాపాలను క్షమించు మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి సజ్జనులతోపాటు మాకు మరణం వొసగు


رَبَّنَا وَآتِنَا مَا وَعَدتَّنَا عَلَى رُسُلِكَ وَلاَ تُخْزِنَا يَوْمَ الْقِيَامَةِ إِنَّكَ لاَ تُخْلِفُ الْمِيعَادِ
రబ్బనా వ ఆత్తినా మా వ అద్ త్తనా అలా రుసులిక వలా తుఖ్జినా యౌమల్ ఖియామా ఇన్నక లా తుఖ్ లిఫుల్ మిఆద్ [3:194]

Telugu Translation

ఓ మా ప్రభూ! నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానం ప్రకారం మమ్మల్ని అనుగ్రహించుప్రళయ దినాన మమ్మల్ని అవమానపరచకు ఎట్టి పరిస్థతిలోనూ నీవు వాగ్దానానికి విరుద్దంగా వ్యవహరించే వాడవు కావు


رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
రబ్బనా ఆమన్నా ఫక్ తుబ్ నా మా అష్ షాహిదీన్ [5:83]

Telugu Translation

మా ప్రభూ!మేము విశ్వసించాము కాబట్టి మా పేర్లను కూడా ధృవీకరించే వారితో పాటు వ్రాసుకో.


رَبَّنَا أَنزِلْ عَلَيْنَا مَآئِدَةً مِّنَ السَّمَاء تَكُونُ لَنَا عِيداً لِّأَوَّلِنَا وَآخِرِنَا وَآيَةً مِّنكَ وَارْزُقْنَا وَأَنتَ خَيْرُ الرَّازِقِينَ
రబ్బనా అన్ జిల్ అలైనా మాయిదతమ్ మినస్సమాయి తుకూనులనా ఇదల్ లి అవ్ లినా వ అఖిర్ నా వ ఆయాతమ్ మిన్ కా వర్ జుఖ్ నా వ అన్ తా ఖైరుల్ రాజిఖిన్ [5:114]

Telugu Translation

ఓ మా ప్రభూ! ఆకాశం నుంచి మా పై ఆహారంతో నిండిన పళ్ళాన్ని దించు దాన్ని మా కొరకు అనగా మా లోని తొలివారు ,తుదివారందరికీ సంతోషకరమైన విషయం కావాలి ఇంకా నీ తరుపున అది ఒక సూచన కాగలగాలి . నీవు మాకు ఆహారం ప్రసాదించు . నీవు అందరికన్నా శ్రేష్ఠమైన ఆహార ప్రదాతవు.


رَبَّنَا ظَلَمْنَا أَنفُسَنَا وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينََ
రబ్బనా జలమ్ నా అన్ ఫుసినా వఇల్లమ్ తగ్ ఫిర్ లనా వతరహమ్ నా లనా కూనన్నా మినల్ ఖాసిరీన్ [7:23]

Telugu Translation

మా ప్రభూ మేము స్వయానికి ఎంతో ఆన్యాయం చేసుకున్నాము ఇప్పుడు నీవు గనక మాకు క్షమా భిక్ష పెట్టి మా పై దయ తలచకపోతే నిశ్చయంగా నష్టపోతాము .


رَبَّنَا لاَ تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
రబ్బనా లా తజ్అల్ నా మాఆల్ ఖౌమి జ్జాలిమిన్ [7:47]

Telugu Translation

ఓ ప్రభూ మమ్మల్ని ఈ దుర్మార్గులలో చేర్చకు


رَبَّنَا افْتَحْ بَيْنَنَا وَبَيْنَ قَوْمِنَا بِالْحَقِّ وَأَنتَ خَيْرُ الْفَاتِحِينَ
రబ్బనా ఇఫ్ తహ్ బైననా వ బైనా ఖౌమినా బిల్ హఖ్ఖి వ అన్ తా ఖైరుల్ ఫాతిహిన్ [7:89]

Telugu Translation

ఓ ప్రభూ మాకూ మా జాతి వారికి మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి నీవు అందరికన్నా ఉత్తమంగా తీర్పుచేసేవాడవు .


رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَتَوَفَّنَا مُسْلِمِينَ
రబ్బనా అఫ్ రిగ్ అలైనా సబ్ రవ్వ వతా వఫ్ఫానా ముస్లిమీన్ [7:126]

Telugu Translation

ఓ మా ప్రభూ మా పై సహనాన్ని కురిపించు నీకు విధేయులు గా ఉన్న స్థితిలోనే మరణాన్ని వొసగు!


رَبَّنَا لاَ تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ الظَّالِمِينَ ; وَنَجِّنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكَافِرِينَ
రబ్బనా లా తజ్ఆల్ నా ఫిత్ నల్ లిల్ ఖౌమి జ్జాలిమీన్ వనజ్జానా బి రహ్మతికా మినల్ ఖౌమిల్ కాఫిరీన్ [10:85-86]

Telugu Translation

మా ప్రభూ మమ్మల్ని ఈ దుర్మార్గుల పరీక్షా సాధనంగా చేయకు.నీ కృపతో మమ్మల్ని ఈ అవిశ్వాసుల చెరనుండి కాపాడు అని వేడుకున్నారు


رَبَّنَا إِنَّكَ تَعْلَمُ مَا نُخْفِي وَمَا نُعْلِنُ وَمَا يَخْفَى عَلَى اللّهِ مِن شَيْءٍ فَي الأَرْضِ وَلاَ فِي السَّمَاء
రబ్బనా ఇన్నక తాలము మా నుక్ ఫి వమా నుఆల్లిను వమా యక్ ఫా ఆలా ల్లాహి మిన్ షయ్యిన్ ఫిల్ ఆర్ ది వలా ఫిస్సమా [14:38]

Telugu Translation

ఓ మా ప్రభూ మేము దాస్తున్నదీ బహిర్గతం చేస్తున్నది అంతా నీకు తెలుసు భూమిలోగాని ఆకాశాలలోగాని ఏ వస్తూవూ అల్లాహ్ నుండి దాగి లేదు.


رَبَّنَا وَتَقَبَّلْ دُعَاء
రబ్బనా వ తఖబ్బల్ దుఆ [14:40]

Telugu Translation

ప్రభూ నా ప్రార్థనను ఆమోదించు.


رَبَّنَا اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ الْحِسَابُ
రబ్బనా ఇగ్ఫిర్ లి వలి వాలిదయ్యవలిల్ మూమినీనా యౌమ యకూముల్ హిసాబ్ [14:41]

Telugu Translation

మా ప్రభూ నన్ను నా తల్లిదండ్రులను విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు!


رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا
రబ్బనా ఆతినా మిల్లదున్క రహ్మతవ్వో వహయ్యిలనా మిన్ ఆమ్రినా రషాదా [18:10]

Telugu Translation

మా ప్రభూ నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చేయ్యి !


رَبَّنَا إِنَّنَا نَخَافُ أَن يَفْرُطَ عَلَيْنَا أَوْ أَن يَطْغَى
రబ్బనా ఇన్ననా నఖాఫు అయ్య్ యఫ్ రుత్ అలైనా అవ్ అయ్య్ యత్ గా [20: 45]

Telugu Translation

ప్రభూ వాడు మా పై దౌర్జన్యానికి పాల్పడతాడేమోననీ లేదా హద్దు మీరి పోతాడేమోనని మాకు భయంగా ఉంది.


رَبَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَأَنتَ خَيْرُ الرَّاحِمِينَ
రబ్బనా ఆమన్నా ఫగ్ ఫిర్ లనా వర్ హమ్ నా వఆన్ తా ఖైరుర్ రాహిమిన్ [23: 109]

Telugu Translation

మా ప్రభూ మేము విశ్వసించాము . కనుక మమ్మల్ని క్షమించు , మా పై దయజూపు నువ్వు దయచూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడవు అని వేడుకునే వారు


رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا إِنَّهَا سَاءتْ مُسْتَقَرًّا وَمُقَامًا
రబ్బనా ఇస్ రిఫ్ అన్నా అజాబ జహన్నమా ఇన్నా అజాబహా కానా గరామా ఇన్నహ సఆత్ ముస్ తఖర్వో వ ముఖామా [25: 65-66]

Telugu Translation

మా ప్రభు మా పై నుంచి నరక శిక్షను తొలగించు . ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికి వీడనిది ని శ్చయంగా అది చాలా చెడ్డచోటు చెడ్డ నివాస స్ధలం .

رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا
రబ్బనా హబ్ లనా మిన్ అజ్ వాజినా వజుర్రియాతినా ఖుర్రతా ఆయుని వజ్ ఆల్ నా లిల్ ముఖ్తఖినా ఇమామా [25:74]

Telugu Translation

ఓ మా ప్రభూ నువ్వు మా భార్యల ద్వారా , మా సంతానం ద్వారా మా కళ్ళకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవ భక్తి పరుల నాయకుని గా చేయి.


رَبَّنَا لَغَفُورٌ شَكُورٌ
రబ్బనా లా గఫూరున్ షకూర్ [35: 34]

Telugu Translation

మా ప్రభువు అమితంగా క్షమించేవాడు ,సత్కార స్వభావుడు


آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ
రబ్బనా వాసిఆత కుల్ల షయ్యిర్ రహ్మతవ్వో వ ఇల్మన్ ఫగ్ ఫర్ లి లిల్లాజీనా తాబు వత్తబవూ సబీలకా వఖిహిమ్ అజావల్ జహిమ్ [40:7]

Telugu Translation

మా ప్రభూ నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహం తో , పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు కనుక పశ్చాత్తాపం చెంది ,నీ మార్గాన్ని అనుసరించిన వారిని నీవు క్షమించు ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు!


رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدتَّهُم وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ وَقِهِمُ السَّيِّئَاتِ وَمَن تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ وَذَلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
రబ్బనా వద్ ఖిల్ హుమ్ జన్నాతి అద్ ని నిల్లతి వఅద్త్ హుమ్ వమన్ సలహ మిన్ ఆబాఇహిమ్ వఅజ్వాజిహిమ్ వ జుర్రియాతిహిమ్ ఇన్నక అన్ తా అజీజుల్ హకీమ్ వఖిహిముస్ సయ్యఆతి వ మన్ తఖిస్ సయ్యిఆతి యౌమఇజిన్ ఫఖద్ రహిమతహు వ జాలిక హువల్ ఫౌజుల్ ఆజీమ్ [40:8-9]

Telugu Translation

మా ప్రభూ నువ్వు వారికి వాగ్ధానం చేసి వున్న శాశ్వితమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు మరి వారి పితామహులలోని ,సతిమణులలోని సంతానంలోని సజ్జనులకు కూడా నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి .
వారిని చెడుల నుండి కూడా కాపాడు యదార్థమేమిటంటే ఆనాడు నీవు చెడుల నుంచి కాపాడిన వారిపై నీవు (అమితంగా ) దయ జూపినట్లే .గొప్ప సాఫల్యం అంటే అదే.


رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا
రబ్బన గ్ ఫిర్లనా వలి ఇఖ్వానీనల్లజీనా సబఖూన బిల్ ఈమాని వలా తజ్ ఆల్ ఫి ఖులుబినా గిల్లజినా ఆమను [59:10]

Telugu Translation

మా ప్రభూమ మ్మల్ని క్షమించు మా కన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేష భావాన్నీ కలిగించకు .


رَبَّنَا إِنَّكَ رَؤُوفٌ رَّحِيمٌ
రబ్బనా ఇన్నక రవూఫుర్ర్ రహిమ్ [59:10]

Telugu Translation

మా ప్రభూ నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు కనికరించేవాడవు.


رَّبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ الْمَصِيرُ
రబ్బనా అలైక తవక్కల్ నా వ ఇలైక అనబ్ నా వ ఇలైకల్ మసీర్ [60:4]

Telugu Translation

మా ప్రభూ మేము నిన్నే నమ్ము కున్నాము నీ వైపునకే మరలుతున్నాము నిన్నే చేరుకోవలసి ఉంది


رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا وَاغْفِرْ لَنَا رَبَّنَا إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
రబ్బనా లా తజ్ అల్ నా ఫత్ నతల్ లిల్లాజీనా కఫరూ వగ్ ఫిర్ లనా రబ్బనా ఇన్నక అన్ తల్ అజీజుల్ హకీమ్ [60:5]

Telugu Translation

మా ప్రభూ అవిశ్వాసు లకొరకు మమ్మల్ని పరీక్షా సాధనంగా చేయకు ప్రభూ మా తప్పులను క్షమించు నిశ్చయంగా నీవు మాత్రమే సర్వాధికుడవు వివేకవంతుడవు


رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا إِنَّكَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
రబ్బనా అత్ మిమ్ లనా నూరనా వ ఇగ్ ఫిర్ లనా ఇన్నక అలా కుల్లి షయ్యిన్ ఖదీర్.

Telugu Translation

మా ప్రభూ అవిశ్వాసు లకొరకు మమ్మల్ని పరీక్షా సాధనంగా చేయకు ప్రభూ మా తప్పులను క్షమించు నిశ్చయంగా నీవు మాత్రమే సర్వాధికుడవు వివేకవంతుడవు

Related Post

One Reply to “40 rabbana”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *