99 Names of Allah – Asmaul Husna
ఖురాను లోని అల్లాహ్ 99 పేర్లు, 99 Names of Allah – Asmaul Husna
1. الرحمن అర్-రహ్మాన్ (దయాళువు, అమిత దయాశీలుడు) అల్-ఫాతిహా :2
2. الرحيم అర్-రహీమ్ (కరుణామయుడు, కృపాశీలి ) అల్-ఫాతిహా : 2
3. الملك అల్-మాలిక్ (ప్రభువు, యజమాని, రాజు ) అల్-ఫాతిహా : 3
4. القدوس అల్-ఖుద్దూస్ (పవిత్రుడు) హషర్ :23
5. السلام అస్-సలామ్ (శాంతి) హషర్ :23
6. المؤمن అల్-మూమిన్ (విశ్వసనీయుడు, భద్రత కల్పించేవాడు,సత్యాన్ని ధ్రువీకరించేవాడు, పూచీనిచ్చేవాడు, )హషర్ :23
7. المهيمن అల్-ముహైమిన్ (సంరక్షకుడు) హషర్ :23
8. العزيز అల్-అజీజ్ (సర్వ శక్తుడు, స్వయంసంపన్నుడు,మహా గౌరవనీయుడు) హషర్ :23
9. الجبار అల్-జబ్బార్ (ఎదురులేనివాడు, ఒత్తిడిచేసేవాడు,బాగుచేసేవాడు, పునరుద్ధారకుడు, నిరంకుశుడు) హషర్ :23
10. المتكبر అల్-ముతకబ్బిర్ (గొప్పవాడు, అహంకారి, గర్వించేవాడు, ఎవ్వరూ తిరుగుచెప్పలేని వాడు) హషర్ :23
11. الخالق అల్-ఖాలిఖ్ (సృష్టికర్త) హషర్ :24
12. البارئ అల్-బారి (చేసేవాడు, తయారీదారుడు) హషర్ :24
13. المصور అల్-ముసవ్విర్ (రూపశిల్పి, చిత్రకారుడు) హషర్ :24
14. الغفار అల్-గఫార్ (క్షమాశీలి, సదా మన్నించువాడు) తాహా :82
15. القهار అల్-ఖహ్హార్ (అన్నిటినీ అణచివేసేవాడు) యూసుఫ్ :39
16. الوهاب అల్-వహాబ్ (వరాలిచ్చేవాడు) ఇమ్రాన్ :8
17. الرزاق అల్-రజాక్ (పోషకుడు) జారియత్ :58
18. الفتاح అల్-ఫత్తాహ్ (ప్రారంభకుడు) సబా :26
19. العليم అల్-అలీమ్ (సర్వజ్ఞాని) సబా :26
20. القابض అల్-ఖాబిజ్ (అడ్డగించేవాడు, సరిచేసేవాడు) నిసా :245
21. الباسط అల్-బాసిత్ (వ్యాప్తినొందించువాడు) నిసా :245
22. الخافض అల్-కాఫిజ్ (అణగదొక్కేవాడు, హీనపరచేవాడు) అల్ వాఖియా :56
23. الرافع అర్-రాఫెయ్ (ఘనపరచేవాడు, పైకిలేపేవాడు) గఫీర్ :16
24. المعز అల్-ముఇజ్జు (గౌరవమిచ్చేవాడు) ఇమ్రాన్ :26
25. المذل అల్-ముజెల్ (వినాశకుడు,అణగదొక్కేవాడు) తౌబా :2
26. السميع అల్-సమీయు (ఆలకించువాడు) షూరా :11
27. البصير అల్-బసీర్ (చూసేవాడు) ఫుర్ఖాన్ :20
28. الحكم అల్-హకీం (పాలకుడు) నూర్ :18
29. العدل అల్-అదల్ (న్యాయమూర్తి) నహల్ :90
30. اللطيف అల్-లతీఫ్ (అతి సున్నితుడు, సూక్ష్మగ్రాహి) షూరా :19
31. الخبير అల్-ఖబీర్ (సర్వం తెలిసినవాడు) ఫుర్ఖాన్ :58
32. الحليم అల్-హలీమ్ (ప్రశాంతుడు, ఓర్చుకునేవాడు, సహనశీలి, దీర్ఘశాంతుడు) నిసా :12
33. العظيم అల్-అజీమ్ (మహోన్నతుడు) నూర్ :14
34. الغفور అల్-గఫూర్ (మన్నించువాడు) నూర్ :22
35. الشكور అష్-షకూర్ (మొర ఆలకించేవాడు) ఫుర్ఖాన్ :62
36. العلي అల్-అలియ్ (ఔన్నత్యాన్నిచ్చేవాడు, గౌరవపరచేవాడు, సన్మానించేవాడు) బఖరా :255
37. الكبير అల్-కబీర్ (గొప్పవాడు) ఫుర్ఖాన్ :58
38. الحفيظ అల్-హాఫిజ్ (కాపాడువాడు, రక్షకుడు) హూద్ :57
39. المقيت అల్-ముఖీత్ (బలపరచువాడు) నిసా :85
40. الحسيب అల్-హసీబ్ (లెక్కించువాడు) నిసా :6
41. الجليل అల్-జలీల్ (గౌరవనీయుడు) రహ్మాన్ :78
42. الكريم అల్-కరీమ్ (అమిత దయాళువు, ధర్మదాత) మూమినూన్ :116
43. الرقيب అర్-రఖీబ్ (సదా కనిపెట్టి చూసేవాడు, కాపరి) నిసా :1
44. المجيب అల్-ముజీబ్ (ఆమోదించేవాడు, స్పందించేవాడు,జవాబిచ్చేవాడు, కోర్కెలుతీర్చేవాడు, ఆపదమొక్కులవాడు) హూద్ :61
45. الواسع అల్-వాసియ్ (సర్వ వ్యాపి) జుమర్ :10
46. الحكيم అల్-హకీమ్ (సర్వజ్ఞుడు,జ్ఞాని) నూర్ :18
47. الودود అల్-వదూద్ (ప్రేమించువాడు,) బురూజ్ :14
48. المجيد అల్-మజీద్ (మహిమాన్వితుడు) హూద్ :73
49. الباعث అల్-బాయిత్ (మృతుల్ని తిరిగి లేపేవాడు) జుమా :2
50. الشهيد అష్-షహీద్ (సాక్షి )హజ్ :17
51. الحق అల్-హఖ్హ్ (సత్యం, నిజం) నూర్:25
52. الوكيل అల్-వకీల్ (ఆదరణకర్త, ఉత్తరవాది) జుమర్ :62
53. القوى అల్-ఖవియ్యు (బలశాలి) షూరా :19
54. المتين అల్-మతీన్ (స్థిరంగావుండేవాడు, మాటతప్పనివాడు, సదా నిలిచి ఉండేవాడు)
జారియత్ :58
55. الولى అల్-వలీయ్యు (మిత్రుడు, అభిమాని, ఆత్మబంధువు, ఆపద్బాంధవుడు) షూరా :9
56. الحميد అల్-హమీద్ (ప్రశంసా పాత్రుడు, స్తోత్తార్హుడు) షూరా :28
57. المحصى అల్-ముహ్ సి (ఎంతైనా ఇవ్వగలవాడు, సర్వవర ప్రదాత,సర్వం అనుగ్రహించువాడు )జుమర్ :35
58. المبدئ అల్-ముబ్ ది (నిర్మాత, ఆవిష్కర్త, ప్రారంభించువాడు) నమల్:64
59. المعيد అల్-ముఈద్ (తిరిగి సృష్టించువాడు) సబా:49
60. المحيى అల్-ముహియ్యు (జీవమిచ్చేవాడు) రూమ్:19
61. المميت అల్-ముమీత్ (జీవం తీసుకునేవాడు, మరణదాత, నాశనం చేయువాడు ) బురూజ్:20
62. الحي అల్-హయ్యి (సజీవుడు, అంతంలేనివాడు) ఇమ్రాన్:2
63. القيوم అల్-ఖయ్యూమ్ (అందరినీ కొరతలేకుండా పోషించేవాడు,) బురూజ్:20
64. الواجد అల్-వాజిద్ (గ్రహించేవాడు, చూచేవాడు, కనుక్కునేవాడు, గురితప్పనివాడు )అద్ దుహా:7
65. الماجد అల్-మాజిద్ (బ్రహ్మాండమైనవాడు, గొప్పవాడు, మాదిరిచూపేవాడు) హూద్:73
66. الواحد అల్-వాహిద్ (ఏకేశ్వరుడు, ఒకే ఒక్కడు) మూమినూన్:52
67. الاحد అల్-అహద్ (ఒకేఒక్కడు, అద్వితీయుడు, ఏకేశ్వరుడు సర్వాంతర్యామి, అఖండుడు) ఇక్లాస్:1
68. الصمد అస్-సమద్ ( స్వయం సమృద్ధుడు, నిత్యుడు, దుర్భేద్యుడు, అజేయుడు, ఈశ్వరుడు,ఎవరి అవసరం లేనివాడు) ఇక్లాస్:2
69. القادر అల్-ఖాదిర్ (సర్వశక్తుడు, అన్నీచేయగలవాడు) ఇనామ్:37
70. المقتدر అల్-ముఖ్తదిర్ (అన్నీ నిర్ణయించేవాడు, అధిపతి) ఖమర్:42
71. المقدم అల్-ముఖద్దిమ్ (త్వరపరచేవాడు, ముందుకునడిపేవాడు,పనులు పూర్తిచేసేవాడు) యూనుస్:11
72. المؤخر అల్-ముఅఖ్ఖిర్ (శాంతకారకుడు) నూహ్:4
73. الأول అల్-అవ్వల్ (ఆది) హదీద్:3
74. الأخر అల్-ఆఖిర్ (అంతం) హదీద్:3
75. الظاهر అజ్-జాహిర్ (కనిపించేవాడు) హదీద్:3
76. الباطن అల్-బాతిన్ (అదృశ్యుడు, కానరానివాడు, దాగివున్నవాడు) హదీద్:3
77. الوالي అల్-వలీ (అధికారి, దాత, ప్రోత్సాహకుడు, అభిమాని) రౌద్:11
78. المتعالي అల్-ముతాలి (స్వీయాభిమాని, ఘనుడు) రౌద్:9
79. البر అల్-బర్ర్ (దయగలవాడు, నీతిమంతుడు) తూర్:28
80. التواب అల్-తవ్వాబ్ (బాకీ ఉంచుకోనివాడు, తిరిగి ఇచ్చేవాడు,) నూర్:10
81. المنتقم అల్-మున్ (తఖిమ్ పగతీర్చుకొనువాడు) సజ్దా:22
82. العفو అల్-అఫువ్వు (మన్నించువాడు, పాపహరుడు) నిసా:43
83. الرؤوف అర్-రవూఫ్ (జాలిపడేవాడు, దయామయుడు) నూర్:20
84. مالك الملك మాలిక్-అల్-ముల్క్ (సృష్టి యజమాని, స్వయంభువుడు) ఇమ్రాన్:26
85. ذو الجلال|و الإكرام జుల్-జలాలి – వ-అల్-ఇక్రామ్ (ఘనతకు, దాతృత్వానికీ ప్రభువు ) ఖమర్:27
86. المقسط అల్-ముఖ్సిత్ (నిష్పక్షపాతి, న్యాయమూర్తి, పగతీర్చేవాడు) ఇమ్రాన్:18
87. الجامع అల్-జామియ్ (సమకూర్చువాడు, ఐక్యపరచేవాడు) షూరా:7
88. الغنى అల్-ఘనీ (మహా సంపన్నుడు, సర్వస్వతంత్రుడు) జమర్:7
89. المغنى అల్-ముఘ్ ని (అమిత ధనవంతుడు, ఉదారుడు) తౌబా:28
90. المانع అల్-మాని (హాని తొలగించేవాడు,తిరిగికాపాడేవాడు, ఆదుకునేవాడు) అల్ ఖసస్:35
91. الضار అద్-దార్ (బాధించేవాడు, కీడుకల్పించేవాడు, కొట్టేవాడు) అర్రాద్:22
92. النافع అన్-నాఫియ్ (మంచిని పుట్టించేవాడు, పరిహారంచేసేవాడు, ప్రాయశ్చి త్తం చేసేవాడు, దోషంవదలగొట్టేవాడు) అర్రూమ్ :37
93. النور అన్-నూర్ (తేజస్వి, తేజస్సు, వెలుగు, జ్యోతి) నూర్:35
94. الهادي అల్-హాది (ఉపదేశకుడు, బోధకుడు) ఫుర్ఖాన్:31
95. البديع అల్-బదీయ్ (పోల్చలేనివాడు, ఆవిర్భావకుడు) ఇనామ్:10
96. الباقي అల్-బాఖి (అమృతుడు, సజీవి) రహ్మాన్:27
97. الوارث అల్-వారిస్ (వారసుడు) ఖసాస్:58
98. الرشيد అర్-రాషిద్ (మార్గదర్శి, గురువు, సర్వజ్ఞాని) హూద్:1
99. الصبور అస్-సబూర్ (సహనశీలుడు, కాలాతీతుడు.) బకరా:251