వుజూ
వుజూ అనగా దేహపరిశుభ్రత. ఆత్మపరిశుభ్రత. నమాజ్ చదివినప్పుడు పవిత్ర ఖుర్ఆన్ గ్రంథ పఠనము చేయునప్పుడు వుజూ తప్పనిసరిగా ఉండవలెను. వుజూ లేకుండా చేసిన నమాజ్, నమాజ్ గా స్వీకరించబడదువుజూ చేయు విధానము
వుజూ చేయుటకు ముందు నియ్యత్ చేయవలెను. వుజూ చేయు స్థలము మలినం లేకుండా శుభ్రముగా ఉండవలెను
నియ్యత్: ‘బిస్మిల్లాహిర్రహ్మా నిర్రహీం
ఉర్దూ: యా అల్లాహ్ మై నియ్యత్ కర్తహు వుజూ కి, నా పాకీ దూర్ హోనేకెలియె
తెలుగు: ఓ అల్లాహ్! నాలో ఉన్న అపరిశుభ్రత దూరమగుటకై వుజో చేయుటకు సంకల్పించుకొనుచున్నాను
బిస్మిల్లాహిల్ అలీయ్యిల్ అజీం
వల్ హందు లిల్లాహి అలాదీనిల్ ఇస్లాం
వల్ ఇస్లాం హఖ్బున్ బాతినున్ వన్నూర్
ఉర్దూ : అల్లాహ్ కె నామ్ సె షురూ కర్తాహు. జొ బులంద్ ఔర్ బుజుర్గ్ హై షుకర్ హై అల్లాహ్ కా మై దీనె ఇస్లాం పర్హు. ఔర్ ఇస్లాం హీ సచ్హై ఫిత్రీ హళీఖీ, ఔర్ రోష్ నీ
తెలుగు: ఖ్యాతిగల వాడైన, ఘనుడైన అల్లాహ్ పవిత్రనామంతో ప్రారం భించుచున్నాను. దైవానుగ్రహం వల్ల నేను ఇస్లాం ధర్మంలో వున్నాను. మరియు ఇస్లామే సర్వస్వం. అదే సహజమైనది మరియు ప్రకాశవంతమైనది నియ్యత్ చేసిన తర్వాత ఈ క్రింది విధముగా వుజూ చేయవలెను
- మణికట్టు వరకు రెండు చేతులు మూడుసార్లు కడగవలెను. వ్రేళ్ళ మధ్య గోళ్ళలో మలినముంటే శుభ్రం చేసుకోవలెను
- మిస్వాక్ చేయవలెను అనగా పళ్ళు తోముకొని 3 సార్లు గరగరా చేయవలెను. (పుక్కిలించవలెను)
- 3 సార్లు ముక్కు రంధ్రములు నీటితో శుభ్రపరచుకోవలెను.
- 3 సార్లు, రెండు చేతులతో ముఖము పూర్తిగా కడుగవలెను. (నుదురు పై భాగము నుండి గడ్డము క్రింది భాగము వరకు చెవులతో సహా)
- 3 సార్లు మోచేతుల వరకు చేతులు పూర్తిగా కడుగవలెను. (ముందు 2 సార్లు కుడిచేయి తర్వాత 3 సార్లు ఎడమ చేయి)
- సర్కా మసా చేయవలెను. అనగా తడి చేతి వ్రేళ్ళతో నుదుటి నుండి శిరస్సు పై భాగం వరకు శుభ్రం చేయవలెను. తర్వాత చేతి వ్రేళ్ళతో చెవి లోపలి భాగం, చెవి వెలుపలి, వెనుక భాగం శుభ్రం చేయవలెను. తర్వాత రెండు చేతులు తడి వ్రేళ్ళతో (వ్రేళ్ళ వెనుక భాగము నుండి) మెడకు రెండు ప్రక్కలా మసా చేయవలెను. (శుభ్రపరచవలెను)
- 3 సార్లు చీలమండలం వరకు కాళ్ళు కడుగవలెను. (మొదట కుడి కాలు తర్వాత ఎడమ కాలు)
ముఖ్య గమనిక: వుజూ చేసినప్పుడు, వుజూ చేసిన భాగము రవ్వంత కూడా పొడిగా ఉండరాదు. (బాల్ బరాబర్ బి సూఖా నహీ రహేనా) వుజూ పూర్తి అయిన తర్వాత కలిమా షహాదత్ చదవవలెను