గుసుల్ (స్నానం)
..మీరు అపరిశుద్ధులుగా ఉంటే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి.(దవ్యఖుర్ ఆన్ 5:6)
ఈ క్రింద ఉదహరించిన పరిస్థితులలో గుసుల్ చేయుట తప్పనిసరి అగును
1. భార్యాభర్తలు కలియుట వల్ల వీర్య స్థలనం అయినా, అవ్వకపోయినా (గుసులె జనాబత్)
2. స్త్రీ పురుషులకు నిద్రలో గాని, మరి ఇతర సమయాలలో స్టలనము.అవుట వల్ల (గుసులె ఎహ్తెలాం) (బుఖారీ ముస్లిం).
3. ఆడవాళ్ళ ఋతుస్రావ కాలము తర్వాత (గుసులె హైజ్).
4. ప్రసవించిన 40 రోజుల తర్వాత (గుసులె నిఫాస్)
గుసుల్ కి నియ్యత్ :
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం పఠించి యా అల్లాహ్
మై నియ్యత్ కర్తాహు గుసుల్ కి, నాపాకీ దూర్ హోనెకెలియే. (పాక్ కెలియే)
తెలుగు: అల్లాహ్! నాలో వున్న అపరిశుభ్రతను దూరం చేసి, శుభ్రత
పొందుట కొరకు ఈ గుసుల్ చేయుచున్నాను